విద్యుదావేషమా మజాకా- ఎస్ మౌనిక

 హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ!మరి మీరు? విషింగ్ ఏ వెరీ హ్యాపీ డే 🤝..... ఈరోజు ఇంకో కొత్త విషయంతో మీ నేస్తం మీ ముందు ఉందిగా! మనం సాధారణ వస్తువులతో ఈరోజు ప్రయోగం గురించి తెలుసుకుందాం. దీనికి కావలసినవి..... దువ్వెన మరియు నీళ్లు వచ్చే కుళాయి అంతే! దువ్వెనతో తలని బాగా దువ్వుకొని...... నీరు చుక్కలు చుక్కలు కారుతున్న కుళాయి దగ్గరగా పెట్టాలి. మీరు ఒక ధార లాగా పడడం మనం గమనించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా?  దీనికి కారణం విద్యుదావేషం. ఆంగ్లంలో ఎలక్ట్రో స్టాటిక్ ఫోర్స్. దువ్వెన కుళాయి దగ్గరికి తీసుకెళ్లినప్పుడు నీటి బిందువుల మధ్య ఘర్షణ వల్ల నీటి బిందువులు  ఒక ధార లాగా ఏర్పడుతాయి. వినడానికి కొత్తగా ఉంది కదూ! ఒకసారి ప్రయోగించి చూడండి ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి టచ్ లో ఉండండి మొలక తో.... 🥰..... ఎటువంటి చాలా విషయాలను నేను మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను. ఇంకో కొత్త విషయంతో మనం త్వరలో కలుద్దాం.  ఉండనా మరి?  బాయ్!
కామెంట్‌లు