జీవితం ఓ సహస్రావధానం(చిట్టి వ్యాసం); - - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కన్ను తెరిచింది మొదలు కన్ను మూసేవరకు ప్రతిమనిషీ తన అస్తిత్వంకోసం అష్టకష్టాలతో అష్ట కాదు, శత కాదుకాదు, సహస్రావధానం చెయ్యాల్సిందే! అది అకలికోసమో, జ్ఞానం కోసమో, సంపాదనకోసమో, పరువుప్రతిష్టలకోసమో,
గౌరవాభిమానాలకోసమో లేదా ప్రేమకోసమో ఏదైనా కావచ్చు. కానీ,
తనజీవితాన్ని తీర్చిదిద్దుకునే క్రమంలో
ఎడారిలో తడారిన గుండెతోనైనా, కడలిలో ఉప్పనైన కన్నీళ్ళతోనైనా, ఆకాశంలో ఊహలరెక్కలతో విహరించైనా సందర్భానుసారంగా తనను తాను కదలి, పరుగెత్తి, ఆగి,
ముడుచుకొని, విప్పారి, మలచుకొని
అనేకానేక అవరోధాలను అధిగమించి,
అనేక ప్రహేళికలను ఛేదించి రసవంతంగా, సరసవంతంగా, సమరసవంతంగా, నవరసభరితంగా, విజయవంతంగా తన జీవితావధానం నిర్వహించాల్సిందే.... కదా!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు