పేదరికంలో పుట్టి మేధావి కర్మయోగి గా ఎదిగిన శాస్త్రవేత్త! అచ్యుతుని రాజ్యశ్రీ
 వసంత పంచమి చాలా కోలాహలంగా జరుపుతున్నారు ఆపిల్లలు."సార్! సరస్వతీ పూజ కి చందా ఇవ్వరూ?" ముద్దు ముద్దు గా అడిగారు ఆపెద్దమనిషిని." ఎలా చేస్తారు ఆపఊజనఇ?" "సరస్వతి విగ్రహం పెడతాం.పురోహితుని పూజతర్వాత ప్రసాదాలు పంచుతాం.సాయంత్రం నాటకం పాటలతో ఆనందిస్తాం". ఆయన నవ్వుతూ "నేను ఆవిద్యాదేవికి చేసే పూజ ను చూపిస్తాను." అని ఆపిల్లలందరినీ తన గదిలోకి తీసుకెళ్లారాయన.అది చూసి పిల్లలు వింత గా ఆశ్చర్యం గా ఆయనను చూడసాగారు."ఏం మీ సరస్వతి అమ్మవారు కనపడటంలేదు?" " ఉహు.అవన్నీ పుస్తకాలు! వందల్లో ఎన్ని పు‌స్తకాలో! అవన్నీ మీరు చదువు తారా?" ఆచిన్నారుల ప్రశ్న కి ఆయన చిరునవ్వే జవాబైంది.ఆంగ్ల ఫ్రెంచ్ జర్మన్ సంస్కృతం లో ఉన్న సైన్స్ అర్ధశాస్త్రం ఇతిహాసాలు పురాణాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో! రాసుకోటానికి కాగితాలు సారాబుడ్డీ కలం ఆబల్లపై ఉన్నాయి.ఇదే నాపూజ అన్న ఆయన మాటలకి బిత్తర పోయారు ఆపిల్లలు!"మీరు కష్టపడి చదివి కొత్త విషయాలు తెలుసు కోవాలి.ఇదే నిజమైన సరస్వతీ పూజ"!
ఇంకో చిత్రం ఏమంటే ఎం.పీ.గా ఆయన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకి వెళ్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయారు.ఆస్పత్రికి తీసుకెళ్ళేలోపే తుదిశ్వాస విడిచారు.ఆరోజు వసంతపంచమి!!
40ఏళ్లు సైన్స్ పరిశోధన లో అధ్యాపకునిగా గడిపారు.విదేశాల్లో వచ్చిన పదవులను తృణీకరించారు.
దామోదర్ నదికి వరదలొస్తే  వేలాది మంది ప్రజలు హాహాకారాలు చేస్తున్న సమయంలో ఆయన చేసిన ‌సేవ మరపురానిది.బాధితులకోసం 23లక్షలు సేకరించారు.యూనివర్శిటీ చదువు ముగిశాక ఆప్రతిభామూర్తి ఉద్యోగం దొరక్క సైకిల్ పై ఇళ్లకి వెళ్లి ట్యూషన్లు చెప్పారు.
తల్లి తండ్రుల 8మంది సంతానం లో ఈయన 5వవారు.తండ్రికున్న చిన్న కిరాణాషాపులో ఆయన పనిచేస్తూ పల్లెలో ప్రాధమిక విద్య పూర్తి చేశారు.డబ్బు దండగ 30మైళ్ల దూరం లో ఉన్న ఢాకా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి తండ్రి పంపనని మొండికేస్తే బడి మాష్టార్లంతా  నచ్చజెప్పి ఒత్తిడి చేశారు.చివరికి సిమూలియా అనే 7మైళ్ల దూరం లో ఉన్న ఊరి బడి లో చేర్చారు ఆతండ్రి.అక్కడి డాక్టర్ అనంతకుమార్ దయవల్ల ఆచిన్నారి ఆయన ఇంట్లో ఉండి చదువుకుని ఢాకా జిల్లాలో ఫస్ట్ వచ్చి స్కాలర్షిప్ పొందటం మనదేశం కి గర్వకారణం! కానీ బెంగాల్ విభజన తో స్కాలర్షిప్ ఆగిపోయింది.ఏప్రభుత్వ బడిలో చేర్చుకోలేదు.కానీ ఢాకాలోని కిశోర్ లాల్ జూబ్లీ కాలేజీ లో సీటుతో పాటు స్కాలర్షిప్ పొందారు.ఆపై కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల్లో ఆనర్స్ డిగ్రీ ఆపై మాస్టర్ డిగ్రీ లో రెండోస్థానంలో నిలిచారు.
ఈయన జీవిత చరిత్ర చదివాక అనిపించింది "ఈరోజుల్లో చదువు అంటే శ్రద్ధ భక్తి పోయి ఎలాగైనా డిగ్రీ వస్తుంది అనే ధీమా ఎక్కువ ఐంది అని.కనీసం ఇలాంటి పుస్తకాలు చదివి వినిపిస్తే బాలల్లో మార్పు వస్తుందేమో?! కానీ తీరిక ఓపిక 
సమయంలేని యాంత్రిక జీవితాలు మనవి🌷
ఆశాస్త్రవేత్త పేరు నోబెల్ బహుమతికి నామినేట్ ఐంది.కానీ కొత్త విషయాలు కనుగొనలేదు అని నిరాకరించారు.ఆయనపేరు మేఘనాధ్ సాహా🌹

కామెంట్‌లు