సెల్ ఫోన్ దుష్ప్రభావాలు; - సి.హెచ్.సాయిప్రతాప్
 సమాజంలో సెల్ ఫోన్ అతిగా వాడడం మొబైల్ వాడడం వలన నష్టాలు వివరిస్తూ అనేకమంది ఔత్సాహికులు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సెల్ ఫోను వాడుక పెరుగుతూనే ఉంది.
మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణలు మితిమీరుతున్నాయని, అటువంటి సెల్ ఫోన్ మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు అంటున్నారు.
సెల్ ఫోన్‌ని కలిగి ఉండటం వలన మీ టీనేజ్ ఉత్పాదకమైన పనులు చేయకుండా రోజంతా మాట్లాడటానికి లేదా మెసేజ్‌లు పంపడానికి ప్రేరేపిస్తుంది. తమ సెల్‌ఫోన్‌లతో ఎక్కువ సమయం గడిపే టీనేజర్లు ఒత్తిడి , ఆందోళన మరియు నిరాశకు గురవుతారని అధ్యయనాలు రుజువు చేశాయి. స్మార్ట్‌ఫోన్‌ల అధిక వినియోగం మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని కూడా పరిశోధనలో తేలింది.
కమ్యూనికేషన్ యొక్క ప్రాథమిక మోడ్‌గా టెక్స్టింగ్‌పై ఆధారపడటం టీనేజ్‌లో ఆందోళనను పెంచుతుంది . టెక్స్టింగ్ తక్షణమే సంతోషాన్నిస్తుంది, కానీ ఇది ఆందోళనను కూడా ఉత్పత్తి చేస్తుంది. స్నేహితుని తక్షణ సమాధానం ఆనందం మరియు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కానీ ప్రతిస్పందన ఆలస్యం లేదా ప్రతిస్పందన లేనప్పుడు, అదే ఆనందం నిరాశగా మారుతుంది.

మనమధ్య సెల్ ఫోన్ రాకముందు సమాజంలో పలకరింపులు బాగుంటే, ఇప్పుడు పలకరింపులు పరిమితమైపోతున్నాయనే భావన బలపడుతుంది.
మన మానవ సమాజం అంతా మానవ సంబంధాలతో సాగుతుంది. నిత్య జీవితంలో బంధుమిత్రులతో కలిసి పనిచేస్తూ, కష్టసుఖాలలో భాగం అవుతూ ఉంటాం.
ఇలాంటి మన మానవ సమాజంలో యంత్రికతకు చోటు తక్కువగా ఉండేది. కాని ఇప్పుడు సినిమాలు మనిషిపై పోకడ పేరుతొ ప్రభావం చూపితే, టివిలు ఒంటరితనం పెంచితే, సెల్ ఫోన్స్ మనిషిపై పూర్తీ యాంత్రికమైన భావనను పెంచుతున్నాయి.

కామెంట్‌లు