అతికాయుడు ;- కొప్పరపు తాయారు

 ఈ పేరు చాలా మందికి ‌తెలియదు.ధాన్యమాలిని రావణాసురుల , కుమారుడు.ఇతడు అంతాకుంభకర్ణుడుని అంటే రావణాసురుని తమ్ముడు పోలికలు. ఆకారం భారీ, అందుకే ఈతని రధం చాలా
పెద్దది. చూడగానే భయం కలిగించే భయంకర ఆకారం. ఇతను మహాబలశాలి. మంచి వరాలకోసం  బ్రహ్మకై తపస్చేస్తూ ఉంటే బ్రహ్మ ప్రత్యక్షమైనా కూడా ధ్యానం లో
ఉండి శ్వాస ఆగి పోతే . బ్రహ్మ అది చూచి అతనికి
తిరిగి ఊపిరి పోసి మూడు వరాలు  ప్రసాదిస్తాడు.
ఒకటి ఎవరినైనా నాశనము చేయు శక్తి గలిగినబ్రహ్మాస్త్రం,రెండు అతికాయునికి  ఏరకమైఅస్త్ర శాస్త్రాలు వల్ల ఆయుధాలు వల్ల ప్రాణాపాయం లేకుండా మంచి కవచ సదృశ మైన శరీరం.మూడుదాహం,మరియు కోరికలేకుండావరాలుప్రసాదించాడు.
      ఈతడు శివుడు నుండి కూడా అస్త్రాలు పొందాడు. ఒకరోజు కైలాస పర్వతంమీదశివుడుఉండగా,పర్వతాన్ని కూల్చ ప్రయత్నం చేస్తాడుఅతికాయుడు. అప్పుడు శివునికి కోపం వచ్చి త్రిశూలాన్ని ప్రయోగిస్తే దాన్ని చేతపట్టి నవ్వుతున్న
అతికాయునిచూచిసంతసించి.అతని వరంగాసర్వ అస్త్రాలను ప్రసాదిస్తాడు. మహాశివుడు.
ఆ విధంగా అతడు మహాబలశాలి, మహా కాయుడు అతికాయుడు..
కామెంట్‌లు