శ్రీలు చెలిగిన కవిత;- ఎం. వి. ఉమాదేవి
అస్తవ్యస్తం గా గుండీలు
ఓ పక్కకి పోయిన తెల్ల చొక్కా కాలర్  
ఎటో చూస్తున్న స్వాప్నిక నయనాలు..
వేళ్ళ మధ్య సగం కాలిన సిగిరెట్..
ఆయనే శ్రీ శ్రీ.. కవితా శ్రీ!

సంప్రదాయ కవిత్వంలో
పస లేదంటే
అంతకన్నా వ్రాసి చూపవోయ్ అన్నారని...
గడుసుగా ప్రాసలతోనే
విప్లవ వైభవం జ్వలించేలా
యువత ఉర్రూతలూగే
భావనల దివిటీ వెలుగు శ్రీ శ్రీ!!


కామెంట్‌లు