సుప్రభాత కవిత ; - బృంద
మింట వెలిగే సూరీడు
నీట చల్లబడి పోయాడు
మంట మాటున మమతలన్నీ
కంట చూపి జంట తానయ్యాడు

కరడు కట్టిన వేడితోనే
కరిగి నీరుగ మార్చాడు
కరుణ నిండిన నీటిధారతో
కరకు రాతిని కదిలించాడు

కిరణాల చలనంతో
చరణాలు కదుపుతూ
గమనాలు సాగించి
భ్రమణాలు జరిపేను

ఋతువుల మార్చుతూ
గతులను కూర్చుతూ
వెతలన్నిటినీ మాపుతూ
కతలందరివీ నడిపేను

కొండలమధ్య నిండుగ
పండుగలాగా వెలుగుతూ
మెండుగ జగతిని కరుణిస్తూ
అండగ తానే ఉన్నానంటూ

వచ్చిన ఆదిత్యుడికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు