సుప్రభాత కవిత ; - బృంద
తూరుపంతా నిశ్శబ్దం 
సముద్రమంతా మౌనం
మబ్బుల మధ్య ఉదయం
కరుణ కురిసిన తరుణం

నట్టేట నావ అయిన  బ్రతుకు
తీరం ఎక్కడ దొరకునో తనకు
దైవం నడిపినా మునుముందుకు
ఉండాలి  ప్రాప్తం అడుగడుగుకూ

భానుని కిరణాల పాతం
కడలికి జిలుగుల సోయగం
వయ్యారి కదలికల ఊగే
కెరటాల ఉయ్యాల  సాగే నావ 

తలపులన్నీ వలపులై
కనుల నిండా మెరుపులై
గుండె గుడిలో సవ్వడై
ఉండిపోమంటున్న ప్రేమకు

మౌనవీణ మోగించి
రాగమేదో పలికించి
యోగమై దొరికినట్టు
సగంగా కలిసిపొమ్మని

పలికిన పలుకున మధురిమలా
చూపున తాకిన సురఝరిలా
మెత్తని నవ్వున  పరిమళంలా
మొత్తం దోచిన హృదయంలా

గొప్పగ తోచే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు