శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 పత్తన్ పట్టన్ అంటే ఓడరేవు అని అర్థం.కౌటిల్య అర్థశాస్త్రం లో పణ్యపత్తన్ అనబడింది.జైనసాహిత్యంలో  సరుకులు ఎగుమతి దిగుమతి జరిగే ప్రాంతం.దాన్ని జలపట్టన్ అన్నారు.నాల్గుదిశలనుంచి సామాను వచ్చే ప్రాంతంని పత్తన్ అన్నారు.సముద్రంఒడ్డున  ప్రదేశం వ్యాపార వాణిజ్య ప్రాం తం ని పత్తన్ అనేవారు.రాజధాని అనే అర్ధంలో వాడారు.విశాఖపట్టణం అలా వచ్చినదే.
సంస్కృతం లో పదవి అంటే మార్గం బాట.సంస్కృతంలో అనుయాహి సాధు పదవీం అంటే సాధువుల మార్గం అనుసరించమని.క్రమంగా ఈపదం హిందీ లో ఉపాధి యోగ్యత బిరుదు గా వాడుతున్నారు.వ్యక్తి యోగ్యత కి తగిన బిరుదు.నేడు ప్రభుత్వాలు సంస్థలు రక రకాల బిరుదులిస్తున్నాయి కదా !
పద్ధతి అంటే సంస్కృతం లో పరిపాటి మార్గం పథం అని అర్థాలు ఉన్నాయి.కాటుక కన్నీటితో నల్లగా చారికలు బందీలుగా చిక్కిన శత్రువుల రాజ్యం కి రాస్తాలు అని వర్ణన చేశారు.హిందీలో ప్రణాళిక విధానం అనే అర్ధంలో వాడతారు.మనిషి నడిచే మార్గంని పద్ధతి అనేవారు.ఓప్రణాళిక ప్రకారం ఒక విధానం లో నడవటం అనే మెథడ్ (ఆంగ్లంలో) అర్థం నేడు వాడుక లో ఉంది.సంస్కృతంలో ప్రణాళిక అని విస్తరించింది.🌹

కామెంట్‌లు