సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -152
బధిర శంఖ న్యాయము
******
బధిర అంటే చెవిటి వాడు. శంఖం అంటే  శంఖువు అనే పేరు గల ఒక రకమైన నత్తజాతికి చెందినది.ఇది సముద్రాల్లో దొరుకుతుంది. శంఖంలో సర్పిలాకారంలో బోలు ప్రాంతం ఉంటుంది.ఇది క్రమ క్రమంగా ఆకారం,సైజు తగ్గి పోతున్నట్టు ఉంటుంది. దీనిని గాలి వీచే దిశలో ఓ ప్రత్యేక కోణంలో పట్టుకుంటే గాలి లోపలికి ప్రవేశించి, దాని కంపనాలు చేసే శబ్ధం, వెలువడే నాదాన్ని శంఖారావం అంటారు.దీనిని ఊదితే పెద్ద శబ్దం వస్తుంది. 
హిందూ సంస్కృతిలో శంఖానికి శుభకరమైన స్థానం ఉంది.ఈ శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీకగా చెబుతారు. దీనిని ప్రత్యేక సందర్భాల్లో ఊదుతూ ఉంటారు. పెద్ద శబ్దం వస్తుంది .
బధిర శంఖం అంటే చెవిటి వాడి ముందు శంఖం ఊదడం.
చెవిటి తనం ఉన్న వ్యక్తి ముందు ఎంత గట్టిగా శంఖం ఊదినా వినపడదు.అంటే ఇలా చేయడం వ్యర్థ ప్రయత్నం అని చెప్పడం ఈ న్యాయము యొక్క సామాన్య అర్థం. 
దీనిని ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేస్తే...   పెద్దలు,హితైషులు చెప్పిన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు,పద్దతులు,మంచి విషయాలు, మాటలు ఎన్నో ఉన్నాయి.అందులో ఎన్నో మానవీయతతో కూడి ఉన్నాయి.అయితే వాటిని వినడం లేదు.ఆచరించడం లేదు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
సుమతీ శతక కర్త ఈ న్యాయమునకు సంబంధించి రాసిన పద్యాన్ని చూద్దాం.
"నవరస భావాలంకృత/ కవితా గోష్టియును,మధుర గానంబును దా/నవివేకి కెంత జెప్పిన/ జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!"
తొమ్మిది రసములతో కూడిన మంచి భావములతో అలంకరించబడిన కవిత్వ సంబంధమైన సంభాషణమును, కమ్మని సంగీతమును జ్ఞాన హీనునకు వినిపించుట యనేది చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఉంటుంది అని అర్థం.
అంటే సంగీత సాహిత్య రుచి తెలియని వారి ముందు అలాంటి విషయాలు ఎన్ని చెప్పినా చెవికి ఎక్కవు. రసాస్వాదన చేయరు అనే అర్థంతో కూడిన ఈ పద్యము బధిర శంఖారావ న్యాయమునకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 ఇక పెద్దలు చెప్పిన మంచి మాటలు  ఏమిటో చూద్దాం...
 పెద్దల పట్ల చూపించ వలసిన గౌరవ మర్యాదలు,వారు చెప్పిన భూత దయ,పరోపకారం, వస్త్రధారణ, మంచి అలవాట్లు, మాటలు విని ఆచరించే వారు.
ఇలా  జీవితంలో క్రమశిక్షణ,ఋజువర్తన,దాన ధర్మాలు చేయడం, పెద్దలను స్త్రీలను గౌరవించడం,తమ కంటే చిన్న వారిని ఆదరణగా చూడటం మొదలైనవి పెద్దల నుండి సంక్రమించిన విలువలను ఆచరిస్తూ , ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు.
 నేడు అవి ఎంతగా లోపించాయో చూస్తుంటే  బాధ కలుగుతుంది.
 అంతర్జాలం, మీడియా,ప్రసార సాధనాల్లో వచ్చే అనేక రకాల సన్నివేశాలు, విషయాలు మనిషి విలువలను చాలా వరకు దిగజార్చే విధంగా వస్తూ ఉన్నాయి.
 గౌరవ వాచకాలు అన్నీ వ్యంగ పదాలు అయ్యాయి.గురువులు, పెద్దలను లోకువగా చూపించడంతో వారంటే లెక్కలేనితనం, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం మొదలయ్యింది.
 ఈ విధంగా   మంచి విషయాలు,మాటలు చెవికి ఎక్కించుకోకుండా, పద్దతి తప్పి నడిచే, ప్రవర్తించే వారిని ఉద్దేశించి ఈ బధిర శంఖ న్యాయమును వర్తింప చేసి చెబుతుంటారు.
 ఈ బధిర శంఖ న్యాయానికి  సామ్యం కలిగిన న్యాయాలు మరికొన్ని ఉన్నాయి.అవే "బధిర కర్ణ జప న్యాయము","బధిర జాప న్యాయము","బధిర వీణా న్యాయము". 
ఇవన్నీ ఒకే కోవకు చెందినవి.. చెవిటి తనం ఉన్న వ్యక్తి ముందు జపం చేస్తూ ఉంటే ఆ జపము వినలేడు.ఎంతో ముఖ్యమైన రహస్యాలు చెప్పడం చాలా కష్టం.సరిగా అర్థం చేసుకోలేడు.
అలాగే ఎంతో మనోల్లాసం కలిగించే వీణ నాదం వినిపించినా చెవిటి తనం వల్ల ఆస్వాదించ లేడు అనే అర్థంతో ఈ న్యాయాలను నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటారు.
వినాలని ఆసక్తి ఉన్న వారికి వినికిడి శక్తిని కలిగించే పరికరాలు వచ్చాయి. 
వినాలని, చేయాలని ఆసక్తి లేని వారి గురించే ఈ న్యాయాల బాధంతా.
అందుకే ఇలాంటి న్యాయాలతో వారికి చురకలు అంటించి వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నం చేసేది.

ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం