కృతజ్ఞత ఒక గొప్ప సద్గుణం; - సి.హెచ్.సాయిప్రతాప్
 కృతజ్ఞత అనేది అన్ని గుణాలలోకెల్లా అత్యుత్తమ  గుణమని శాస్త్రం ప్రభోదిస్తొంది.మనకు అవసరార్ధమైన పరిస్థితులలో అడిగిన తడవుగా సహాయం అందించేవారు వుంటారు. మరికొందరు మన అవసరం గ్రహించి అడగకపోయినా సహాయం అందిస్తుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై వుండాలి. ఒకనాడు మనకు మేలు చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తు కష్టాలలో వున్నట్లు తెలిస్తే, అడగకపోయినా వెళ్ళి సహాయం చేయడం మన కర్తవ్యం . కృతజ్ఞత అనేది అత్యుత్తమ సంస్కారాలలో ఒకటిగా భావిస్తారు.
 
ఈ కలియుగంలో కృతజ్ఞత అనేది మృగ్యంగా మారింది. అవసరంలో సహాయం అందుకొని, అనంతరం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన  సహాయం చేసిన వారిని మర్చిపోవడం, వారు ఎదురుపడినా తప్పించుకు తిరగడం సర్వసాధారణమైపోతొంది. అవసరమని వేడుకోవడం, అవసరంలో వాడుకోవడం, అవసరం తీరాక ఆడుకోవడం మానవ సహజ ప్రవృత్తిని అయిపోయింది. ఇక కృతజ్ఞతకు తావెక్కడిది ?అందువలన మనుష్యులపై, మానవత్వంపై నమ్మకం తగ్గుతొంది.

అత్మోపనిషత్ మనకు మేలు చెసిన సాటి మానవులతో పాటు ఈ సృష్టిలో మన మనుగడకు కారణమైన పశువులు,పక్షులు,క్రిమికీటకాదులు, చెట్లు, చెమలు అన్నింటికీ కృతజ్ఞులమై వుండమని చెబుతొంది. శత్రువైనా సరే వారి మేలును కాంక్షిస్తూ,కృతజ్ఞత, దయ కలిగి వుండమని చెబుతొంది. ముఖ్యంగా మనకు జన్మనిచ్చి, మన అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మన తల్లిదండ్రుల ఋణం ఏనాటికీ తీర్చుకోలేనిది.వారిని వృద్ధ్యాప్యంలో వదిలేసి కృతఘ్నత భావం కలిగివుండడం అన్ని పాపాలలో కెల్లా మహా పాపం అని వేదం చెబుతోంది.

మనకు మేలు చేసిన వారిపై కృతజ్ఞత కలిగి వుండడం కొంతవరకు సులువే కాని మనకు కీడు చేసిన వారిపై కుడా కృతజ్ఞత కలిగి ఉండడం జరిగే పనేనా అన్న ప్రశ్న జనిస్తుంది. కాని ఇందుకు సమాధానం కుడా అత్మోనిపరిషత్ చెబుతొంది. భగవంతుడు సృష్టించిన సకల జీవులపై సమదృష్టి కలిగి, అందరినీ ఒకే విధంగా అంతే ఆత్మదృష్టితో చూడగలిగితే స్నేహితులు, శత్రువులు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. అపకారులకు కుడా మేలు చేసే సహృదయత అలవరచుకొని కృతజ్ఞతాభావం ప్రకటించగలుగుతారు.

కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది.డబ్బుకు మనం ఇచ్చే విలువ మనల్ని సకాలం లో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఏర్పరుస్తుంది.
అందువలన మనల్ని అధమ పాతాళానికి తొక్కేసే అత్యాశ, గర్వం, అహంకారం లను వదిలి, సుగుణాలైన సంతృప్తి , కృతజ్ఞతాభావాలను అలవరచుకునేందుకు కృషి చేయాలి

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం