డాన్స్ చేయిస్తున్న ధ్వని- ఎస్. మౌనిక
 హాయ్! మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీ!మరి మీరు? విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ డే! నేను ఈరోజు ఇంకో ఆసక్తికరమైన అంశంతో మీ ముందున్నానుగా! చూసేద్దామా మరి? ఇంకెందుకు ఆలస్యం? చూసేద్దాం. శబ్దం అంటే సౌండ్. శబ్దం అనేది ఒక శక్తి అని మీరు ఎప్పుడైనా విన్నారా? మనం తెలుసుకుంటుంది ఈ రోజు దాని గురించే నండి! ఇందుకోసం మనం ఒక చిన్న ప్రయోగం చేయాల్సి ఉంటుంది. దీనికి కావలసినవి ఒక ప్లాస్టిక్ డబ్బా, ఒక బ్లూటూత్ బాక్స్,ఒక బెలూన్ మరియు చక్కెర అంతే! ప్లాస్టిక్ డబ్బాలో ఒక బ్లూటూత్ బాక్స్ ని పెట్టాలి. ఆ బ్లూటూత్ బాక్స్ నుండి సౌండ్ వస్తూ ఉండాలి. ఆ తరువాత బెలూన్ ను మన బాక్స్ అమెరిక కి సరిపోయే విధంగా కత్తిరించుకొని టేపుతో పైన చూపిన విధంగా అతికించుకోవాలి. దానిపైన చక్కెర వేయాలి. బ్లూటూత్ లో సౌండ్ వస్తూ ఉన్నంతవరకు కూడా మనం చక్కెర డాన్స్  చేయడం చూస్తాం. బ్లూటూత్ ని మనం ఆఫ్ చేసి ఒకసారి గమనించవచ్చు. అప్పుడు ఆ చక్కెర డాన్స్ చేయదు. దీని ద్వారా మనం శబ్దం కూడా ఒక శక్తియే అని నిరూపించవచ్చు. కొత్తగా ఉంది కదూ! ఆసక్తికరంగా కూడా ఉంది కదా! ఇటువంటి ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది మీ ఫ్రెండ్! ఉండనా మరి! బాయ్! మళ్లీ కలుద్దాం!

 


కామెంట్‌లు