ప్రాసాక్షరి.-(చిచి. లులు. కక. పప. లులు. కుకు.)- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
తేటగీతిమాలిక.

ఎం(చి )చూడగా ధర్మాని కెచట నెలవు?
మం(చి )తనమీ ధరణిలోన మాయమాయె.
క(లు)షితంబగు సంఘమున్ గాచుటెవరు?
ప(లు )తెఱంగుల జనులిట్లు బాధ పడుచు
శ్రీ(క)రంబగు జిష్ణునిన్ జింత జేయ
ప్రా(క)టంబగు వెల్గుతో ప్రజ్వలించి
యా (ప)రమవిభు డిచ్చోట నవతరించి
తా(ప) మంతయు తొలిగించి దరికి చేర్చి
వి(లు)వలన్నియు నేర్పుచు వెతలు దీర్చి
శ్రీ(లు )కురిపించి జనులకు శ్రేయమొసగె.
చీ(కు )చింతలు బాపు నా శ్రీధరునిని
నా(కు )ప్రాణ సఖుడని నే నమ్ముకొంటి.//

-------------------------------------------------------


కామెంట్‌లు