సాగిపో చెల్లెలా.;- త్రిపురారి పద్మ.జనగామ.
పల్లవి::
సాగిపో చెల్లెలా
ధైర్యమే నీవుగా
జీవితం వలయమూ
దాటితే సుగమమూ.

         "సాగిపో చెల్లెలా"

చరణం::
కష్టమూ నష్టమూ
పరీక్షలై వచ్చునూ
ఓరిమీ సహనమూ
కూర్చునూ విజయమూ

  "సాగిపో చెల్లెలా"

చరణం::
సుడిగుండమే వచ్చినా
అదరకా బెదరకా
ధీరవై దాటుమా
ఆలిగా గెలువుమా
 
"సాగిపో చెల్లెలా"

చరణం::
బాధలా నావకూ
చుక్కానివే నీవుగా
తీరమే చేరుమా
విజయవై నిలువుమా

"సాగిపో చెల్లెలా"

చరణం::
నీ ప్రేమలో పిల్లలు
ఎదిగెడీ తరువులు
మమతలా ఫలములై
వచ్చులే శుభములు.

 "సాగిపో చెల్లెలా"


కామెంట్‌లు