బావుటా;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మన భాషనూ యాసనూ అవహేళనచేసి
మన కవితనూ చరితనూ అణగదొక్కి
మన కవులనూ కావ్యాలనూ చులకనచేసి
మన నీళ్ళనూ నిధులనూ నియామకాలనూ కాజేసి
ఇక్కడినేలపైవసిస్తూ 
ఈనేలనే సెజులు సెజులుగా అమ్మేసి
ఇక్కడి ఆదాయాన్ని తమగడ్డకు తరలించి
"మీకు ఒక్కపైసా ఇవ్వను పొ"మ్మంటూ దుర్భాషలాడి
"తెలంగాణ మాదే"నంటూ నినదించిన ప్రతిసారీ
మూతులు బిగియగట్టి జైళ్ళలోకి తోయించి
తెలంగాణ కోసం అమరులైనవారినికూడా లెక్కచేయక
సీమాంధ్ర పాలకులు 
ఏం మూటగట్టుకుపోయారో తెలియదుకానీ...,
తెలంగాణ అమాయకత్వం, విశాలహృదయం, మానవత్వం
తెలంగాణ వీరత్వం, ధీరత్వం,కార్యశూరత్వం
తెలంగాణ సహనశీలత్వం,సాధనాశీలత్వం
ప్రపంచయవనికపై ప్రదర్శితమైంది
వినీలగగనాన బావుటాగా మెరిసింది !!
*********************************

కామెంట్‌లు