ఫాదర్స్ డే శుభాకాంక్షలు;- బల్ల కృష్ణవేణి- పలాస- శ్రీకాకుళం జిల్లా
 ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం రోజున ఫాదర్స్ డే ను నిర్వహించుకుంటున్నారు.
"నాన్న'"... తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపనపడే నిస్వార్ధపు మనిషి నాన్నంటే బాధ్యత,... ఓ భద్రత, భరోసా.... కన్న బిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెల పై మోస్తాడు, వాళ్ల కోసం రక్తం చిందిస్తాడు, ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కన పెడతాడు, తన బిడ్డలు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్నపిల్లడిలా సంబరం పడిపోతాడు.
ఓడినప్పుడు నేనున్నాలే అని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి.... ఒక్కరే... ఆయనే నాన్న..
నాన్న... అన్న పదము కన్నా కమ్మగా ఉండదు వెన్న.... లక్ష్యం వైపు దూసుకెళ్లే బాణం మనమైనా... నాన్న లాంటి విల్లే లేకపోతే దాని ఫలితం సున్నా...... రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన రేపటి మనకు నిలువుటద్దం నాన్న.... అలాంటి నాన్న దేవుడి కన్నా మిన్న. మేమున్నామని ఎందరు చెప్పినా నాన్నగారి ఆదరణ ముందు అవి ఏవి నిలబడవు
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ఓ పాప.... నాన్న కథ.....

కొండాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు కోటన్న, అతని భార్య పేరు కొండమ్మ, భార్యాభర్తలిద్దరూ వ్యవసాయం పనులు చేసుకుని ఆ ఊరిలో గౌరవంగా బ్రతుకుతున్నారు. వారికి చాలా కాలం తరువాత సంతానం కలిగింది. ఆ పాప పేరు కోమలి, ఆమెకు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న బడిలో చదివించుతున్నారు. ఆమెకు కష్టం విలువ తెలియకుండా పెంచారు. తండ్రి కోటన్న కోమలి బడి ఆట స్థలం నుండి రోజు వ్యవసాయం చేయడానికి పొలం కి వెళ్తుండేవాడు. ఒకరోజు బడి పిల్లలు ఆటలు ఆడే సమయంలో పొలం నుండి కోటన్న ఇంటికి వస్తున్నాడు. అప్పుడు పిల్లలు ఆడే బాలు కోటన్నకి తగిలి, గాయం అయ్యి పడిపోయాడు. పిల్లలు అంతా కోమలి!, మీ నాన్నకి దెబ్బ తగిలింది రా అని పిలిచారు. అప్పుడు ఆమె అతను మా నాన్న కాదు అని చెప్పింది. తన నాన్న ఒక పంచ,, భుజంపై తువ్వాలు తో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. చూడడానికి పనివాడిలా ఉన్నాడు అని మిత్రులందరూ ఎగతాళి చేస్తారని అలా చెప్పింది కోమలి. అదే బడిలో తెలుగు మాస్టారు వచ్చి కోటన్నకి ఎత్తి పట్టుకుని నీళ్లు త్రాగించి, కోమలి తన నాన్నని నాన్న కాదని అన్నది అందుకు మందలించి నాన్న విలువ కోమలికి తెలిసి వచ్చినట్లు చెప్పారు.
నాన్న అంటే ఓర్పుకి మారుపేరు
మార్పుకు మార్గదర్శి
నీతికి నిదర్శనం
మన ప్రగతికి సోపానం... నాన్నే
నాన్నే నీ మొట్టమొదటి గురువు అని మాస్టారు బోధించారు. అప్పటినుండి కోమలి తన తల్లి, తండ్రి పైన గౌరవంతో మసులుతుంది. వాళ్లే ప్రత్యక్ష దైవాలుగా తెలుసుకుంది
ప్రతి కొడుకు,, కూతురు తల్లితండ్రులను చివరి కాలం వరకు ప్రత్యక్ష దైవాలుగా భావించి గౌరవముగా చూసుకోండి.
.... నాన్నకు ప్రేమతో.....



********************s


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం