* వారసత్వ బహుమతి *; - కోరాడ నరసింహా రావు !
 నాన్నా...., డబ్బు, బంగారం... 
ఇల్లూ, భూములు నేను సంపాదించిన
 ఆస్తులుగా, మీకందివ్వాలని...
 ఇంతకాలమూ యాతన పడ్డాను బిడ్డా.... !
        మాతరం..., అమితసుఖాలకలవాటు పడి 
  మీకు, మీపిల్లలకు, మీ పిల్లల పిల్లలకు...
 కడుపుకింత కూడె కాదు... 
తాగటానికి గుక్కెడు నీళ్లు శుద్దమైనవి
 అందివ్వలేక పోతున్నామని తెలుసుకో లేక పోయాము బిడ్డా.... !
      ఇప్పటికే, స్వచ్ఛమైన గాలి కి నోచుకోక... ఊపిరులందక... 
ఆక్సిజన్ సిలిండర్లను వాడుకో వలసిన దుస్థితి దాపురించేసింది !
    ఇంక మీతరాన్ని ఊహించుకుంటే భయమూ, బాధా కూడా కలుగుతోంది !!
   మేమంతా విచక్షణా రహితంగా చెట్లనన్నిటినీ

 నరికేస్తూ... అడవులనన్నిటినీ అంతరింప జేసేసాం... !!
    మీరైనా  మేల్కొని ఈ మొక్కలను విరివిగా నాటండి 
  ఇవే... మేము మీకివ్వాల్సిన నిజమైన వారసత్వ సంపదలు !
      జాగ్రత్తగా కాపాడుకుని... 
 అభివృద్ధి పరచుకోండి... 
   ఇవే మీకు వెలకట్టలేని సంపదలు... !!
    .  ******--
కామెంట్‌లు