ఓటమి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు  లతగీత బడి నుంచి వచ్చారు. "అమ్మా!స్లీప్ టెస్ట్ లో  20/20 తెలుగు లో " అందిలత! "నాకు 15/20"కసికోపంగా ఉంది గీత గొంతు. ఔనుమరి ఇద్దరూ కవలపిల్లలు. తల్లి అంది" ఫర్వాలేదు. ఈసారి నీవూ తెచ్చుకోగలవు.ఒకరితో పోల్చుకోవడం తప్పు. మీకు దివ్యామిశ్ర అనే ఓ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ గూర్చి చెప్తాను వినండి. ఆమె కాన్పూర్ నివాసి. తండ్రి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్. తమ్ముడు దివ్యాంష్ సైన్యంలో లెఫ్టినెంట్. అప్పుడే ఉరి ప్రాంతంలో దుండగుల దాడి జరిగింది. తనుకూడా ఏదో చేసి సాధించాలని కంకణం కట్టుకుంది.  ఎన్నో సార్లు యు.పి.ఎస్సీ పరీక్షలలో ఫెయిల్ ఐంది. ఇలామూడు నాల్గుసార్లు జరిగింది.పి.హెచ్ డి చేస్తూ 6_7గంటలు రోజు చదివేది.మూడోసారి 28 వరాంక్ పొంది యు.పి.లో ఐ.ఎ.ఎస్.గా సెలక్ట్ ఐంది. ఒకరితో పోల్చుకోవడం ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ తో బాధపడటం తగదు.మీరు కవలపిల్లలు ఐనా  ఒకరకంగా మార్కులు ఉద్యోగాలు వస్తాయి అని భావించరాదు..ఎవరిశక్తి ప్రతిభ వారిది" అని ఓదార్చింది. అంతే  పిల్లలిద్దరూ నవ్వుతూ ఆడుకోడానికి బైట కి తుర్రుమన్నారు🌹
కామెంట్‌లు