భారతమ్మ పదాలు ;- పి. చైతన్య భారతి
ఓ మూల పడి వుండు 
స్వచ్ఛతకు ముందుండు 
ప్రతియింట తానుండు 
ఓ భారతమ్మ !

మెదపలేదూ నోరు 
ఊడ్వలేక చీపురు 
పెట్టును కంటనీరు 
ఓ భారతమ్మ !

పరిశుభ్రతే కోరు 
ఊడ్చిపెట్టూ ఊరు 
త్యాగమే తనతీరు 
ఓ భారతమ్మ !

పొగరునసలు ఎరుగదు 
జీతమే అడగదు
విసిరేస్తే అలగదు 
ఓ భారతమ్మ !


కామెంట్‌లు