లింగ బేధము - సమానత్వము - కోరాడ నరసింహారావు !

  @ అవగాహనాలోపం.. !
.   అవకాశవాద పరిణామం !!
          *****
       పరస్పర సహకారయోచన వికటించి.... కుల వ్యవస్థతో పాటు , స్త్రీ, పురుషులమధ్య కూడా అంతరాలను పెంచేసింది 
        హెచ్చు - తగ్గుల అపోహలను సృష్టించింది.. !
 ఎన్నెన్నో విపరీత పరిణామాలకు దారితీయించింది !!
     లింగబేధము - సమానత్వము విషయాలకొస్తే 
 రాతియుగంనాటి జీవనవిధానంలో... గుంపుకి స్త్రీ లే నాయకత్వం వహించే వారన్నది చరిత్ర చెబుతున్న సత్యం !
         కాలానుగుణంగా... స్త్రీకి మాతృత్వమే బలహీనతై... పురుషుని ఆధిక్యం పెరిగి... స్త్రీ లు సంతానోత్పత్తి గృహ సంరక్షణ బాధ్యతలు స్వీకరించగా... పురుషులు బయటి కార్యకలాపాలు సంపాదనా బాధ్యతలతో... కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకుంది... !
     పరస్పరం గౌరవించుకొంటూ  ప్రేమాభిమానాలతో హాయిగా బ్రతికే ఆ రోజులు పోయి....స్త్రీ, పురుషుల మధ్య  ఎక్కువ - తక్కువలు చోటు చేసుకుని... 
  సంపాదనే గొప్పగా భావించి, స్త్రీలు సంపాదనాపరులైతే... మగవారిని లెక్కచేయరనే అనుమానంతో... స్త్రీ లను వంటింటి కుందేళ్ళను చేసి, వారి శ్రమను వాడుకోవటం వారి బ్రతుకులతో ఆడుకోవటం మొదలయింది... !!
  ఆంక్షలకు, అణగద్రొక్కటానికీ హద్దులు లేకుండా పోయాయి !
 లింగవివక్ష, సమానత్వము అనే ఉద్యమాలకు ఇవే బీజాలు వేసినాయి !!
 బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, కన్యాశుల్కాలు, వరకట్న దురాచారాలు... ఇన్నా, అన్నా ఎన్నెన్నో విధాల స్త్రీలను హింసించటం మొదలు పెట్టారు 
      ఆడవారిని చదువుకో నివ్వలేదు, గడప దాటనివ్వలేదు..., అన్నివిధాలా ఆడవారిని అణగద్రొక్కే ఉంచారు !
     
       ఎందరో సంఘ సంస్కర్తలు ఎన్నెన్నో ఉద్యమాలు... !
 ఆఖరికి ఆడపిల్లకు చదువుకునే అవకాశం చిక్కింది, ఉద్యోగాలు చేస్తూ సంపాదనాపరులైనా..., అన్నిరంగాలలో ఎన్నెన్నో ఘనవిజయాలు సాధిస్తున్నా 
 సమాజం లో వివక్ష పోలేదు  !
  లైంగిక వేధింపులు... మానభంగాలు, హత్యలు ఆగడం లేదు...!!
ఇన్నిఅనర్ధాలకూ,  దుష్పరిణామాలకూ మూలం... స్త్రీ, పురుషులు పరస్పరం గౌరవ, మర్యాదలను ఇచ్చి పుచ్చుకొనక పోవటమే !
 సంపాదించే మగవాడెంత గొప్పో... ఇంటిని చూసుకునే స్త్రీ కూడా అంతే గొప్ప అని గుర్తించక పోవటమే !
   మగాడ్ని, మొగుడ్ని, సంపాదనా పరుడ్ని... నాచెప్పు చేతల్లో భార్యఅనేది   అణగి, మనిగి ఉండాల్సిందే అనే అహంభావమే, ఇన్ని సమస్యలకూ మూలం.. !!
    భార్యా భర్తల్లో ఎక్కువ తక్కువ అనే భావనే  లేకుంటే, 
కుటుంబ రథానికి ఇరువురూ రెండుచక్రాలు రెండు చక్రాలూ సమముగా ఉంటేనే బండి సాఫీగాసాగి... గమ్యం క్షేమంగా 
 సౌఖ్యంగా చేరుకోగలం అనే సత్యాన్ని ఇరువురూ గ్రహించి సామరస్యంతో... పరస్పర ప్రేమాభిమానాలతో ప్రవర్తిస్తే... 
ఈ వివక్ష, సమానత్వము అనే వే తలెత్తవు కదా... ! 
    బాధ్యతలను గుర్తించినవారికి, హక్కులు వాటికవిగా వచ్చి చేరునన్నది అక్షర సత్యము.... !
  కావలసినవి... స్వేచ్ఛ, హక్కులు, సమానత్వము కావు... పరస్పర గౌరవం, ప్రేమాభి మానాలు... !!
       ********
కామెంట్‌లు