"ప్రద్యుమ్నుడు";- కొప్పరపు తాయారు

  ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీల పుత్రుడు.
శంభరాసురుడు ప్రద్యుమ్నుని వలన మరణం ఉందని
తెలుసుకొని ఆ శాపము నుండి తప్పించుకొనటకు
పసి బాలుడు గా ఉన్న ప్రద్యుమ్నుడిని ఎత్తుకెళ్లి సముద్రంలో పడవేస్తాడు. ఆ బిడ్డని ఒక పెద్ద చేప మింగుతుంది అది మత్స్యకారుల వ వలలో పడి వారి చేత చిక్కుతుంది. వారు దానిని శంభరాసురుడు కి బహుమానంగా ఇస్తారు. అప్పుడు
తన వంట వారికి ఇస్తాడు. ఆ చేప పొట్ట కోసిచూడగా  అందులో ముద్దులొలికే చిన్నారి బాలుడు కనిపించడంతో ఆ యువతి పెంచి పెద్ద చేస్తుంది.ఆమే, మాయావతి,ఆమే పెంచుతుంది. ఆ మాయావతి, రతీ దేవియేనని మాయావతిగా పుట్టిందని తెలుసు కుంటుంది. ఈమె పెంచుతుంది
ఒకరోజు నారద మహర్షి వచ్చి మాయావతిని చూచి తన పూర్వజన్మ వృత్తాంతం తెలిపి ప్రద్యుమ్నుడు
ముందు జన్మలో మన్మధుడు అని తెలుసుకుని
తన భర్త ఈ జన్మలో ఈ రూపం పొందాడని తెలిసికొని ఇంకా ప్రేమ పెంచుకుంటుంది. మాయావతి.
           అతనికి సర్వశత్రు మాయావినాసిని అయినటు వంటి మహా మాయా యుద్ధ కళను
నేర్పుతుందీ.
             ప్రద్యుమ్నుడికి శంభరాసురుని విషయం తెలిసి అతని పైకి యుద్ధానికి వెళతాడు.శంభరాసురు
డు ఎన్నో యుద్ధ విన్యాసాలు జూపినా తన వల్ల కాక
పోవడం వల్ల మాయా ప్రయోగాలు చేస్తాడు.కానీ 
ప్రద్యుమ్నుడు మాయా యుద్ధ కళను నేర్చుకోవడం
వలన,అది ఉపయోగించి సర్వం నాశనం చేస్తాడు.
చివరకు అత్యంత శక్తి వంతమైన  వైష్ణవ వాస్త్రాన్ని 
ప్రయోగించి శంభరాసురుడు ని చంపుతాడు..
కామెంట్‌లు