"మధువని"ల; - డా. మురహరరావు ఉమాగాంధి
మనసును చల్లగా
లాలించి జోకొట్టి ఊపేటి వెన్నెలమ్మను కానా...!

 హృదయాన్ని మేల్కొలిపే నునులేత  కిరణాల వేకువని కానా..!

పరువం పల్లకిలో మధువనిని ప్రేమగా తాకే  అల్లరి తెమ్మెర ని కానా..!

నీ సహజీవన సరాగంలో  అందం అమరత్వం చూపే పుష్పరాగం  కానా...!

నీ మదిలో చక్కని భావాలకు అక్షర ప్రాణం పోసే ఓ చిక్కని కవితను  కానా ...!

కామెంట్‌లు