మదిలోనిభావాలు ;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కోరికలచిట్టాని
విప్పాలనియున్నది
కోనేటిరాయుని
కటాక్షంపొందాలనియున్నది

కన్నకలలన్ని
సాకారంచేసుకోవాలనియున్నది
జీవితాన్ని
సఫలీకృతపరచుకోవాలనియున్నది 

చూచినవన్ని
అందంగాయుండాలనియున్నది
ఆనందాన్ని
అందుకోవాలనియున్నది

చేసినవన్ని
బహుబాగుండాలనియున్నది
నలుగురికి
నచ్చాలనియున్నది

పాడినవన్ని
సరిగమపదనిసలుకావాలనియున్నది
ప్రేక్షకులందరిని
పరవశింపజేయాలనియున్నది

అక్షరాలన్నింటిని
అద్భుతంగావాడాలనియున్నది
అందరిచదువరులని
అలరించాలనియున్నది

పేర్చినపదాలన్ని
పసందుకూర్చాలనియున్నది
పాఠకులందరిని
పులకరించాలనియున్నది

విషయాలన్ని
వైవిధ్యభరితంగాయుండాలనియున్నది
వివిధసంఘటలని
విన్నూతనంగా వివరించాలనియున్నది

ఆలోచనలని
సాగించాలనియున్నది
అద్వితీయమైనట్టి
కవితలనందించాలనియున్నది 

వ్రాసినవన్ని
మంచిగాయుండాలనియున్నది
మదులనుముట్టి
మురిపించాలనియున్నది

సరస్వతీదేవిని
మెప్పించాలనియున్నది
సాహిత్యలోకాన్ని
సుసంపన్నంచేయాలనియున్నది


కామెంట్‌లు