సుప్రభాత కవిత - బృంద
సాగిపోయే మబ్బులారా
ఆగి చూసేరెందుకూ??
అలవికాని వేడిసెగల
విలవిల లాడే పుడమిని...

చినుకు కురిసీ మనసు మురిసే
తరుణమొచ్చి వేచి ఉన్న
తరువుల తపన జీవుల వేదన వరుణుడికి వినిపించలేవా??

ఎడతెగని తలపుల
ఎండ సెగలకు వసివాడిన
మదికి నిండుగ పండుగలా
భువిని మొత్తం తడుప రావా??

మనసు దూదిపింజలా
తేలు మబ్బు తునకలా
చిటాపటా చినుకలలో 
ఆటలాడే కోరికుంది తీర్చలేవా?

చిత్తడిగా నేల తడిసి
విత్తులన్ని ఒడిని నింపుకుని
కొత్త మొలకలు వేసుకోవాలని
పుత్తడి నేల వేచివుంది కనలేవా?

ఎదురుచూపు ఎంతసేపు?
కుదురులేక  కుమిలే మనసుకు
నింగి నుండి దిగివచ్చి
బెంగ తీర్చి పోలేవా??

తప్పులన్ని మన్నించి
ఎప్పటివలె తప్పనిసరిగా
వర్షధారల కురిపించి
హర్షమును కలిగించి

పుడమిని పులకరింపచేయమని
ప్రార్థిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు