సాత్వికాహారం; -: సి.హెచ్.సాయిప్రతాప్

 సర్వ ప్రాణికోటి జీవనాధారం ఆహారమే! మనలోని ఆకలిని చల్లబరిచి, శరీరంతోపాటు పంచ ప్రాణాలకూ ఆధారమై, పంచభూతాల సాక్షిగా శక్తిని సమకూర్చే అన్నం సృష్టి యజ్ఞానికే ఆలంబన. ఈ ఆహారం వల్లనే మనిషిలో సత్వరాజస తామస గుణాలు ఏర్పడుతాయని అంటారు.
‘ఆహార శుద్ధౌ సత్త్వశుద్ధిః సత్త్వశుద్ధౌ ధ్రువాస్ముతికః’- అనే ప్రసిద్ధ వాక్యం శుద్ధమైన ఆహారం స్వీకరించాల్సిన ఆవశ్యకతను సూచిస్తొంది.. మనం తీసుకునే ఆహారం పరిశుద్ధంగా ఉంటే సత్త్వంగుణం ఉదయస్తుంది. ఆ సత్వగుణం వల్ల బుద్ధిని, మనసునూ, జీవిత సరళినీ క్రమబద్ధీకరించి మానవ మనుగడను ఆనందమయం చేస్తుంది. ఆహారాన్ని బట్టే మన ఆలోచనలపర్వం మారతుంది.
పరిశుద్ధమైన ఆహారం’ అంటే ధర్మయుతంగా సంపాదించిన దానిల్లోంచి తిన్న ఆహారమే సత్వగుణుడుగా రూపొందిస్తుంది. దానం చేసినా అది న్యాయ మార్గంలో సంపాదించిన దానిలో నే చేస్తే పుణ్యం వస్తుంది. కాని పరులను దోచి అందులో భాగం భగవంతునికి ఇస్తే అది పుణ్యాన్ని కాదు పాపాన్ని ఒనగూరుస్తుంది.
స్వచ్ఛతకూ, స్పష్టతకూ తోడ్పడే ఆహారం సాత్వికమైనది. ఆయా కాలాల్లో పండే సేంద్రీయ పళ్లు, కూరగాయలూ,  హుషారైన గోవు పాలు, మొలకలు, చిక్కుళ్లు, నట్స్‌, విత్తనాలు, తేనె, హెర్చల్‌ టీ... ఇవన్నీ సాత్విక కోవలోకి వస్తాయి. ఈ ఆహారం తాజాగా, తక్కువ పరిమాణాల్లో తీసుకోవాలి.
ఆహారాన్ని నియంత్రించడం. ఆహారం అంటే కేవలం తినే పదార్థాలు అనే కాదు. బాహ్య ప్రపంచంలోనుండి మనలోకి వెళ్లే ప్రతిదీ ఆహారమే. తినే ఆహారం పీల్చే గాలి, తాగే నీరు, చూడటం, వినడం, తాకడం, జననేంద్రియములతో అనుభవం ఇవన్నీ ఆహారం కింద లెక్క. వీటిని నియంత్రించడం ద్వారా కుదా మనోపవిత్రత సాధించవచ్చునని శాస్త్రం చెబుతొంది. 
కామెంట్‌లు