కాశ్మీర్ తొలి మహిళా ఐ.పి.ఎస్;- అచ్యుతుని రాజ్యశ్రీ

 "తాతా!ఈరోజు  నేను ఓ అద్భుత మహిళ ను గూర్చి చెప్తాను " విజ్జీ అంది."అంత కంటేనా ?చెప్పుచేతల్లో!" "ఆమె పేరు రువేదా సలాం! కాశ్మీరు లోని కుపవాడాలో నివాసం. బాల్యంనుంచీ టెర్రరిస్టు భయం తుపాకీ మోతలతో దద్దరిల్లే ప్రాంతం!ఆమె ఐ.పి.ఎస్.ఆఫీసర్ కావాలని తండ్రి కోరిక. కానీ ఆమె శ్రీనగర్ మెడికల్ కాలేజ్ లో ఎం.బి.బి.ఎస్.పూర్తి చేసి 2013లోయు.పి.ఎస్.సి.లో సెలక్ట్ ఐంది. అలాకాశ్మీరీ తొలి మహిళా ఐ.పి.ఎస్.గా మన హైదరాబాద్ లో శిక్షణ పొందింది.నేడు కాశ్మీర్లో ఆడపిల్లలకు స్ఫూర్తి గా నిల్చింది.  సిడ్నీలో జరిగిన  జి20సమ్మేళనం లో భారత్ ప్రతినిధి గా హాజరైంది.తనబాల్యం అంతా టెర్రరిస్టుల భయంతో గడిచింది అని  బడికి వెళ్లలేని పరిస్థితులున్నా తన సంకల్పం గట్టిదని అనుకున్న లక్ష్యం చేరానని సగర్వంగా చెప్పిందామెర!" తాత  విజ్జీ ని తెగ మెచ్చుకున్నారు. ఇలాంటి వారి ని గూర్చి చదివి మనం కూడా ప్రయత్నిస్తే అనుకున్నది సాధించగలం.కృషితో నాస్తి దుర్భిక్షం కదా🌷
కామెంట్‌లు