అతడొక కవితా జీవనది... !-- కోరాడ నరసింహా రావు.
సమాజ సంద్రంలో.... 
   జీవనతాపానికి,  
   ఆవిరిగా....కరిగిపోయి...  
    మనో వినీలాకాసం లో... 
     భావనల మబ్బులుగా... 
     ఘనీభవిoచి....., 
   ఆలోచనా చిరుగాలుల తాకిడికి, కరిగి...., 
   అక్షరబిందువులుగారాలి, 
సాహిత్య నదియై ప్రవహించి 
 పరీవాహక ప్రాంతాల దాహార్తి దీర్చుచు...., 
         సద్భావనాల సస్య శ్యామలాన్ని పరచుకుంటూ... 
    సాగిపోయే... జీవ నదిఅతడు... !
          సాహితీ నదిగా అతడు  పుట్టటమే 
బీడువారిన సమాజ క్షేత్రాలన్నిటినీ .., 
ఆనంద నందన వనాలుగా  మార్చటానికి.... !
     ఎన్నెన్ని సమస్యల పనుకురాళ్లు అడ్డుతగులుతున్నా..

.,అతడి  గమనం, ఆగేది కాదు... !
   ఈ మజిలీలన్నీ ముగించుకుని, గమ్యం చేరిపోయినా..., 
   మరణం లేని సాహితీ జీవ నదియే  అతడు .... !!
       *******
కామెంట్‌లు