విద్య!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
దేవుడైన
నిన్ను నిలబెట్టి నిలబెట్టి
నీకు దర్శనం ఇస్తాడు!!!
కానీ
నిజాయితీగా తను నిలబడి
మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టేవాడు
ఈ ప్రపంచంలో
ఉపాధ్యాయుడు ఒక్కడే!!?

ప్రపంచాన్ని చంపింది ప్రపంచాన్ని మోసం చేసింది
ప్రపంచాన్ని అమ్మింది ప్రపంచాన్ని విడదీసింది-ధనం‌

కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది
ప్రపంచాన్ని ఆధునికరించింది
ప్రపంచాన్ని గ్రహాలను సముద్రాలను దాటించింది_-విద్య
ప్రపంచానికి సౌకర్యాన్ని సౌందర్యాన్ని సంతోషాన్నిచ్చింది-విద్య

ఇప్పుడు
ధనం కన్నా విద్యా ధనమే నిజమైన ధనం!!

ఊరు ఊరుకు వాడవాడకు ఓ దేవుడున్నాడు!!
కానీ మనిషి లేడు!!
ఊరు ఊరుకు వాడవాడకు ఒక బడి ఉంది
అక్కడ ఉన్నది ఓ ఉపాధ్యాయుడు
అక్కడ ఉన్నది ఒక వీరుడు విద్యార్థి!!!

దేశ రక్షణకు బడ్జెట్ ఎంత ముఖ్యమో
దేశ శిక్షణకు అంత ధనం ముఖ్యం
అంత విద్యాదానం ముఖ్యం!!!!!!!!?

ప్రతి విద్యార్థి మళ్ళీ ఓ ఉపాధ్యాయుడై
పదేళ్లయిన పసిపిల్లలకు
ప్రత్యేక నైపుణ్యాలను ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వాలి!!?

చదువు అంటే పని కాదు
చదువు అంటే మనీ కాదు
చదువు అంటే ఒక బంగారు గని!!!?

మనిషి
అశ్వాన్ని మాత్రమే స్వారీ చేయగలడు
విద్యావిశ్వాన్ని మొత్తం స్వారీ చేస్తుంది!!!

కలల్ని నిజం చేసేది
మనసు కాదు మనిషి కాదు
కలల్ని నిజం చేసేది
నీవు నేర్చుకున్న విద్య మాత్రమే!!!!

ఇంతకుముందు
ధనవంతులు అనుకున్న వాళ్లు
గొప్పవాళ్లు అనుకున్న వాళ్లు అందరూ
ఇప్పుడు ఓడిపోయారు

బడి ముందు బడిపంతుళ్ళ ముందు
విద్య ముందు విజ్ఞానం ముందు!!!!!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాసిన కవిత

Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు