సరదా సంగతులు!అచ్యుతుని రాజ్యశ్రీ
 "తాతా!మాబడిలో పాఠాలు ఇంకా మొదలు పెట్టలేదు. తమాషా సరదావిషయాలు రేపు క్లాస్ లో చెప్పాలి.ప్లీజ్!అలాంటి రెండు నిజసంఘటనలు చెప్పవు?" శివా సాయి అడిగారు."అలాగే! జర్మనీ కి చెందిన రిచర్డ్ ప్లాట్జ్ ఒక సీసాలో పోస్ట్ కార్డు ని పెట్టి  దాన్ని సముద్రం లోకి విసిరాడు. ఒక చేపలు పట్టేవాడికి దొరికింది. దాన్ని అతను కూడా గిరాటేశాడు.కొంత మంది కి సముద్ర తీరం లో ఆసీసా దొరికింది. కుతూహలంగా దాని మూతతీశారు.లోపల రిచర్డ్ రాసిన కార్డ్ కనపడితే దాన్ని చదివారు.అందులో ఇలారాసి ఉంది "దీన్ని చూసిన వారు బెర్లీన్ లోని అడ్రస్ కి అందజేయండి" ఆఅడ్రస్ ఆధారంగా ప్లాట్జ్ కుటుంబాన్ని కలుసుకుని అతని మనవరాలు 62ఏళ్ళ యాంజెలాకు ఇచ్చారు. 
కేవలం కుక్కలు ఆవులు మాత్రమే కాదు బర్మీస్ పైథాన్ అనే పామును ఎక్కడో విడిచి పెడితే తిరిగి అదిమూడు మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి తన స్వంత గూటికి చేరింది. దాని కి అంత జ్ఞాపకశక్తి ఉంది అన్న మాట. " తాత మాటలకి పిల్లలు సంతోషంగా అరిచారు "రేపు ఈరెండు యధార్థ సంఘటన లు  మాక్లాస్ లో చెప్తాం తాతా!"🌹      

కామెంట్‌లు