వయసు తో పనిలేదు! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆరోజు పిల్లలు బడి నుంచి ఇంటికి వస్తూనే "అమ్మమ్మా!నీవు కూడా మాతో చదవాలి.టెన్త్ పాస్ కావాలి"అని గోల గోల గా  అరవసాగారు."నామొహం!ఈ వయసులో 55ఏళ్ళ దాన్ని  చిందులు!?" అమ్మమ్మ నవ్వుతూ అంది.అంతే జయ అంది"ఈరోజు మా టీచర్ మహారాష్ట్ర కి చెందిన ఓ అమ్మమ్మ గూర్చి చెప్పారు. కల్పన అనే 53ఏళ్ళ మహిళ  10వక్లాస్ 79.60%తో పాసైందిఆమె కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ స్వయంగా చెప్పాడు.ఆకుర్రాడు ఫారిన్ నించి ఇండియా వచ్చాక తెలుసు కున్నాడు.నైట్ స్కూల్ కి వెళ్లి చదువు కుంది ఆమె.అబ్బాయి పెళ్లి ఫిబ్రవరి  ఐనా ఆమె పనులు చేస్తూ రాత్రి చదివి మార్చిలో పరీక్ష రాసి పాసైందిఆమె.తన తల్లి గూర్చి ఇలా అన్నాడు " మొదలు పెట్టిన పని కష్టం నష్టం వచ్చినా చేసి తీరాలి. లైఫ్ అంటే అదే మరి.మనసు లగ్నం చేసి పని చేసి తీరాలి. ఆమె పూర్తి పేరు  కల్పనా అచ్యుత్"2021లో చదువు మొదలెట్టింది. అమ్మమ్మ నవ్వుతూ అంది "పిచ్చి పిల్లలూ! నేను ఎసెల్సీ పాసైనాను. కాకపోతే మీలాగే ఇంగ్లీష్ టకటకా మాట్లాడలేను".అంతే ఆశ్చర్యంగా ఆమెవంక చూశారు పిల్లలు 🌹

కామెంట్‌లు