విజయగానాలు ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 తెలంగాణ బిడ్డలం
దగాపడిన తమ్ములం 
తెలంగాణ వచ్చే దాకా
తెగబడి కొట్లాడినం
తెలంగాణ తెచ్చినం తెలంగాణ తెచ్చినం!
ఇసంత రమ్మంటే ఇల్లంత నాదంటూ
మన సంస్కృతి మంటగలిపినారంట 
తెలంగాణ పురమున్న
మనకే తెలుగు నేర్పినారంట
మనది కాదట అచ్చ తెనుగు 
తెలుగనార్యుడే లేడట
పోతన్న రామదాసులు
"ఆంధ్ర"కృతులు చేసినారంట
సమ్మక్క సారక్కల ధైర్యశౌర్య చండిమలు
కాకతి రుద్రమ్మకున్న శక్తియుక్తి ధీపటిమలు 
రాణీ శంకరమ్మ రాయ్ రాయ్ బాగన్ లు 
సర్దార్ పాపన్న కొమురం భీముల సాహస తేజాలు
మొక్కవోని తెలంగాణ 
జనజాగృతి అడుగు జాడలే కదా!
పచ్చని మాగాణాలు పసిడి ధాన్య రాసులు 
సురగంగలు నిండినట్టి స్వచ్ఛమైన చెరువులు
ఘన ఖనిజ సంపద నిచ్చే గనులు 
తెలంగాణతల్లి ఒడిలో చల్లని బాండారాలు
తెలంగాణానెండవెట్టి 
ఆంధ్రకు ముక్కారు పంటల అందలమట 
తెలంగాణ పెనుచీకటి సంద్రాన మునుగ
ఆంధ్రకేము విద్యుద్దీపావళియట 
తెలంగాణా ఉషోదయమయ్యింది కదూ!
ఇక ఆంధ్రా అధికార పొగమంచు విడిపోతోంది 
తెలంగాణా గానా బజానా ధూంధాంలకు
సీమాంధ్ర నిశీధిశబ్దాలు సిగ్గుతో అంతరించినయ్!
తెలంగాణ విజయ గానాలు 
జగమంతా నిండినయ్!!
*********************************
.
కామెంట్‌లు