భీష్ముని అనుమానాలు;- కొప్పరపు తాయారు

 యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు...
                యుద్ధం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు భీష్ముడిని కలవడానికి వస్తాడు. భీష్ముడు ఇది ధర్మ యుద్ధమా అని అడుగుతాడు.
                శ్రీకృష్ణుడు ఎవరు గురించి అడుగుతున్నారు. కౌరవుల గురించి లేక పాండవుల గురించి అంటాడు.
               నేను కౌరవుల గురించి అడగటం లేదు పాండవుల గురించి అడుగుతున్నాను.
             గురువు ద్రోణాచార్యులు వారిని మోసం తోటి చంపడం, దుశ్శాసనడికి గుండె చీల్చి రక్తం తాగడం, సైంధవుడిని మోసంతో చంపడం,  కర్ణుడిని   నిరాయుధుడిని చేసి చంపడం. ఇవన్నీ ధర్మ బద్ధమైన  పనులేనా చెప్పు. అయినా ముందు జన్మలో అంత ధర్మాన్ని ధర్మ నిరతి కలిగిన వాడివి, నీవు రాముడు వి అలాంటిది. ఈ జన్మలో ఎందుకు ఇలా అధర్మాన్ని ఎంచుకున్నావు.
     శ్రీరాముడి కాలం లో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది. కానీ ఇప్పుడు అన్నీ  అధర్మం గానే నడు
 స్తున్నాయి.జరుగుతున్న పరిస్థితి కను గుణంగా
అన్నీ సర్దుకుని చక్కబెట్టు కుంటూ ధర్మాన్ని నిలబెట్టు
కోవాలి. ఇంకా ముందు రాబోయే కాలంలో ఇంకా
అధర్మం పెరగవచ్చు అప్పుడు కూడా మనం మన
ధర్మాచరణ నీ,మన ధర్మాన్ని నిలబెట్టు కుంటూ, కాపాడు కోవాలి అన్నాడు. శ్రీ కృష్ణుడు.
కామెంట్‌లు