సప్తవర్ణశోభితమీ -- కోరాడ నరసింహా రావు !

 పల్లవి :-
.    సప్తవర్ణ శోభిత మీ ప్రపంచం సప్త స్వర సంగీత మె జీవితం !
ఆహ్లాద భరితంగా చేసుకో... 
  ఆనందించు, ఆనందాన్ని పంచుతూ జీవించు !!
       "సప్తవర్ణ శోభితమీ.. "
చరణం ;-
 సాధన చేయనిదే విజయం సాధించలేవు !
  ఓడిపోయావా నీరంగులు 
వెలిసి వెల - వెల బోతావు  !!
      "సప్తవర్ణ శోభితమీ.... "
చరణం :-
     మనిషoటే    సుస్వరాల రాగాలను కడదాకా పలికిస్తుండాలి,  
బ్రతుకంటే, వివిధ వర్ణాలతో.... కనువిందులు చేస్తూనే ఉండాలి
     "సప్త వర్ణ శోభితమీ.... " 
    *******
కామెంట్‌లు