శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 పంచామృతం అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కల్పి అభిషేకాలు చేస్తాం.ఇదే గుడిలో మనకు తీర్ధంగా ఇస్తారు.
పంజ్ ప్యారే అనేవారు గురుగోవిందసింహ్ ముఖ్యశిష్యులు ఈయనేఖాల్సాపంథ్ ని ఏర్పాటు చేసేటప్పుడు ఓపరీక్ష పెట్టాడు."మిమ్మల్ని బలిఇస్తాను" అని చెప్పి పిలిస్తే వారు ఎలాంటి సందేహమూ లేకుండా తటపటాయించకుండా ఆయన ముందు నిల్చారు.వారినే గురువులుగా ఏర్పరిచి వారి చేతిలోంచి తీర్ధం పుచ్చుకున్నారు.వీరు 5గురు శిక్కు మతానికి మూలస్థంబాలు ఐనారు 
పంజాబ్ అంటే సత్లజ్ వియాస్ రావి చినాబ్ ఝేలమ్ అనే5నదులు ప్రవహించే ప్రాం తం.ప్రాచీనగ్రంధంలో దీనిపేరు పంచనద్! ఋగ్వేదంలో సప్తసింధు అని ఉంది.మహాభారతంలో మద్ర ఆరట్టసింధు గాంధార్ అన్నీ ఈపంజాబ్ లోనే ఉన్నాయి.

కామెంట్‌లు