వీణ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కాలం పదఘట్టనల కిందకాదు 
కుత్సిత మనస్కుల కాళ్ళకింద
ప్రజల గుండెల నుండి కాదు 
పాలకుల నిర్లక్ష్యం మూలంగా
తెలంగాణా తెలుగు
అణిచివేయబడింది
సక్కనైన తెలుగు
పుట్టిందే తెలంగాణలో
తెలంగాణ పురమే దానికి సాక్ష్యం
తెలంగాణలో కవులే లేరని 
పరిహసించినచోట
కవులతోటను కాననివారి
కనులు తెరిపించిన చోటు
ఆదికవి నన్నయ్య అన్నవారిని 
కాదు కాదు
"ఆదికవి పంపన్న" అని 
వారిని నిలువరించిన చోటు
తెల్లాపురం, కొండాపురం, బోధన్, 
కురిక్యాల, కోటిలింగాల, ధూళికట్ట
ఇలా ఎన్నో చోట్ల ఉన్న శాసనాల సాక్షిగా 
తెలంగాణ అచ్చతెలుగు పుట్టిల్లు 
నా తెలంగాణ
తీగలు తెగి మోడైన వీణ
నేడు
చిగురించి పలికించు
కోటి రాగాలనైన!!
*********************************

కామెంట్‌లు