ఆస్తీకునిజననం(పురాణకథ)డా.బెల్లంకొండనాగేశ్వరరావు


 జరాత్కారుడు బ్రహ్మచర్య నియమంతో తపోదీక్షకొనసాగిస్తూ అరణ్యాలలో పయనిస్తుండగా,కొందరు ఒక చెట్టుకొమ్మకు తల్లకిందులుగా వేళ్లాడుతూ కనిపించారు.వారివద్దకువెళ్లి "ఎవరుమీరు ఎందుకు ఇలాఉన్నారు'' అన్నాడు. "నాయనా మేము నీపూర్వీకులం నీవు వివాహం చేసుకుని సంతానాన్ని పొందితే మాకు స్వర్గం ప్రాప్తిస్తుంది"అన్నారువాళ్లంతా."మీకు ఈబాధ త్వరలో తప్పుతుంది.నారేరు కలిగిన యువతినే వివాహం చేసుకోవాలి  అనె నియమం కలిగిఉన్నాను "అంటూ తనపేరు కలిగిన యువతిని అన్వేషిస్తూ ఉన్నాడు.

ఒక రోజు ఓ యువతి తో వచ్చిన యువకుడు జరత్కారుని దర్శించి నమస్కరించి"మహానుభావ నేను నాగజాతి రాజును నాపేరు వాసుకి ఈమెనాసోదరి "జరత్కారువు" తమరు నాసోదరిని వివాహంచేసుకుని ఇరువంశాలను ఉద్ధరించండి"అన్నాడు వినయంగా.అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నజరత్కారుడు మెదటిరోజు"దేవి నేటినుండి నామనసు కువ్యెతిరేకంగా,నన్నునొప్పించేలా నీవు ప్రవర్తిస్తే ఆక్షణమే నిన్ను వదలి వెళతాను"అన్నాడు." "అలాగే స్వామి "అన్నది ఆమె.కాలక్రమంలో   జరాత్కారువు గర్బవతి అయింది. ఒక రోజు బాగా అలసిన జరత్కారుడు ఓచెట్టునీడన తనభార్య తొడపై తలపెట్టి ,సాయంకాలం ఆదమరచి నిద్రపోసాగాడు.కొంతసేపటికి సూర్యుడు పడమటికనుమల కు చేరువకాబోతున్నాడు.అదిచూసినఆమె తనపతి సంధ్యాసమయంలో జరుపవలసిన వేదవిహిత కర్మలకు ధర్మ లోపంఏర్పడుతుంది.కాని నిద్రలేపితే కోపగించుకుంటారని భయపడుతూనే జరత్కారుని నిద్రలేపింది. సుఖ నిద్రకు భంగంవాటిల్లడంతో కోపంగా"నాకు నిద్రాభంగం ఎందుకు కలిగించావు" అన్నాడు."స్వామి సంధ్యాసమయం అయింది.తమరు విధ్యుక్తకర్మలు జరపాలి కదా"అంది."వెర్రిదానా నేనునిద్రపోతుండగా అస్తమించడానికి సూర్యునికి ఎన్నిగుండెలుకావాలి! నాభార్యవై ఉండి ఈమాత్రం గ్రహించలేకపోయి నన్ను అవమానించావు.కనుక నానియమం ప్రకారం నిన్ను వదలివేస్తున్నాను.అయితే యింతకాలం నీవు నాపట్లచేసిన సేవలు నాకెంతోసంతోషాన్నికలిగించాయి.నీకు సూర్యసమప్రభావుడైన పుత్రుడు జన్మిస్తాడు వానికి ఆస్తీకుడు అనేపేరుపెట్టు ఉభయుల వంశాలను ఉధ్ధరిస్తాడు.నువ్వు నీఅన్నవద్దకువెళ్లు"అనిచెప్పి తనదారిన తానువెళ్లిపోయాడు.అలాజన్మించిన ఆస్తీకుడు జనమేజయ మహారాజు ఆరంభించిన సర్పయాగాన్ని ఆపి తనతల్లి తరపు బంధువులైన నాగజాతిని రక్షించాడు.


కామెంట్‌లు