సుప్రభాత కవిత ;- బృంద
ఊరించే కలలన్నీ
ఊహలలోనేనా??
వారించే కారణాలు
కఠిన నిజాలేనా?

నిదురించే మబ్బులు
విదిలించిన చుక్కలతో
నేలంతా తడిసేనా
వేడి సెగలు తగ్గేనా?

ఆలస్యంగా వచ్చిన గెలుపులా
అంతరంగాన్ని మురిపించే
కోరికా??
నీటి మీది రాత వ్రాసి
తోసి వెళ్ళిపోదామని
తొందరా?

పొలాల ఎదురుచూపు
హలాల నిలువరింపు
రైతుల బెదురుచూపు
అసహాయమేనా?

కనుల దాటని గంగ
పెదవి దాటని బెంగ
చినుకు పడని నేల
కునుకు పట్టని రేయి

కినుక వహించిన వరుణుని
కానుకలతో స్వాగతించి
ఏలిక నీవేనంటూ పోలిక చెప్పి
చాలిక కోపమని అర్థిస్తూ

🌸🌸  సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు