వలస పోయిన వాడలు ;- ఎం. వి. ఉమాదేవి, బాసర
వాకిట్లో ముగ్గులో నిండే పసుపు కుంకుమలు...
పండుగకి వస్తున్న సంతోషంతో 
కిక్కిరిసిన ప్రయాణసాధనాలు..
అమ్మఊరుమీద అభిమానం ఋజువు!

పెచ్చులు రాలుతున్న
పాతఇంట్లో మమకారం
ఒక్కో వస్తువుచుట్టూ  అలుముకున్న కతలెన్నో
వ్యథలెన్నో లెక్కలేయాలా?
చివరివరకూ బ్రతుకు పోరాటమే
అయినపుడు ఎక్కడుంటే ఏమి?
అన్నయువతకి సరైన జవాబు లేదు.

చుట్టూర కూర్చుని తినడం నాడు!
ఒకరి సాన్నిహిత్యమే భరించలేని నేటి ఏకాంత స్థితి!
సర్వం జగన్నాథం అనుకుంటే పోలా!!కామెంట్‌లు