ప్రకృతి తో ఆరోగ్యం!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆఫీసు నించి వచ్చిన నాన్న రంకెలేయసాగాడు"ఛ..ఛ..అస్సలు బుద్ధి లేకుండా పోతోంది. బైట ఇసుక లో ఏమిటా ఆటలు?" పాపం పిల్లలు బిక్కమొహం వేశారు. తాత అన్నాడు " అదేంట్రా అలా విసుక్కుంటావు?నీవు చిన్నప్పుడు పశులపాక చుట్టూ తిరుగుతూ దాక్కునేవాడివి.
అసలు గోశాలలో ఆవుపే డ మూత్రం వల్ల వ్యాధిక్రిములు నశిస్తాయి.  మైల ఏవైనా దీర్ఘవ్యాధులు వస్తే  గోమూత్రం పేడతో ఇల్లు శుభ్రం చేసేవారు. 
మడ్ బాత్ అని ఇప్పుడు మసాజ్ కేంద్రాల్లో చేస్తున్నారు. అసలు గంగానది మట్టి నీరు పవిత్రమనే మనం తెచ్చుకుంటున్నాంకదా? ప్రాచీన కాలంనించీ అన్ని దేశాల్లో మడ్ థెరపీ    మడ్బాథ్ రోజూ చేసేవారు. గంగానది మట్టి లోఎక్టినోమైసిటెస్ అనే జీవాణువులు ఉన్నాయి.సీజన్స్ ని బట్టి ఇవి త్వరగా మారుతూ రోగనిరోధక శక్తి ని కలిగిస్తాయి.పూర్వం సబ్బులు లేవు.తెల్లారుఝామునే లేచి నదిదగ్గరున్న మట్టి ని ఒంటికి నలుగుపెట్టి సూర్యనమస్కారాలు చేస్తూ స్నానం జపంచేసి ఇంటికి బైలు దేరేవారు.  రైతులు కూలీలు కూడా అలాగే పనుల కి వెళ్లేవారు. అందుకే అంత ఆరోగ్యం గా ఉండేవారు. మనం యోగాదినం అని జరుపుతున్నాం.ఇవాల్టినుంచి పార్క్ లో సాయంత్రం గంట సేపు ఆడాలి పిల్లలంతా!" తాత ఉపన్యాసం తో నాన్న నోరు మూత బడింది.పిల్లలు ఆనందంగా గంతులేయసాగారు🌹
కామెంట్‌లు