నీ జీవితమే... ఓ పాఠం !;- కోరాడ నరసింహా రావు.
మూడుకాళ్ళ ముసలితనంలోనూ... 
మండు టెండలో.... 
   వంగిన వీపుపై కట్టెలమోపుతో బతుకుపోరును సాగిస్తున్న అభాగ్య  జీవి !
    హాయిగా ఓ మూలకూచుని.,
  రామా, కృష్ణా అనుకొనుచూ 
    వేళకింత తిండి తిని సుఖించవలసిన సమయంలో, 
   ఈ పడరాని పాట్లా  !!?
   వయసులో సంపాదించుకున్న డబ్బైనా ఉండాలి.., 
. . కడుపున పుట్టిన బిడ్డలైనా ఉండాలి అంటారు గానీ... !
     కన్న బిడ్డలైనా చూస్తారన్న గ్యారంటీ లేదు... !
        ధనమే మూలమైన ఈ ప్రపంచం లో... 
     సంపాదించి భద్రంగా దాచుకున్న డబ్బైతే... కాస్త భరోసానివ్వగలడేమో... !!
     రోజులు మారాయి !
  అందరూ బ్రతక నేరుస్తున్నారు 
నువ్వేం తల్లీ... ఇంకా ఆ పాతరోజుల్లోనే కూరుకుపోయావు... !
  నువ్వు బ్రతకనేర్చక పడుతున్న బాధలు చూసి.... 
  ముందురాలు బ్రతకటమెలాగో నేర్చుకుంటారు... !
    నీ జీవితం... వీళ్లకో పాఠం !!

కామెంట్‌లు