స్నేహమువిలువ;- మిట్టపల్లి పరశురాములు
కం

స్నేహమె కలిమియు జగమున
 స్నేహమెతోడుగనునుండిచిగురులువేయున్ 
 స్నేహమునిరతముజేయగ
స్నేహమెకలకాలముండుచెదరకరామా!

తే.గీ
కులముమతములేదుమేలిమి-కూర్మియందు
మంచిమనసులకలయిక-మాలగాను
కలిమిలేములయందున-కలిసిపోయి
చెలిమి తోడుగానున్నను-బలము పెరుగు

తే.గీ

మణులుమాణిక్యములునేల-మంచిచెలిమి 
కలిగియున్ననుమనకెంతొ-కలిమిగలుగు
మెరిసెకనకముకన్నను-మేదియందు
స్నేహబంధమేనిలుచును-స్థిరముగను

తే.గీ

స్నేహమున్ననుచాలును-చెదిరిపోని
బంధమదియునుపెరుగును-బాగుగాను
కష్టకాలముయందున-ఇష్టముగను
తోడనుండునుచెలికాడు-నీడవోలె.

ఆ.వె

పూలువాడిపోవు-పుడమిలొనిరతము
వెన్నెలారిపోవు -వేగముగను
కరిగిపోవుచుండు-కనకంబుజూడగ
చిగురుతొడుగునదియె-స్నేహమొకటె.


కామెంట్‌లు