సుప్రభాత కవిత ; - బృంద
బంగరుపూతల తూరుపు
నింగిన మబ్బుల ఊరేగింపు
నిండిన కనులకు ఓదార్పు
ముంగిలి నిండిన మెరుపు

ఊరించే వర్ణాలతో ముస్తాబై
విహరించే జలదాల  దారిలో
విరిసేనా రంగుల వానవిల్లు
కురిసేనా సన్నని చిరుజల్లుగా

గుండెల్లో గుబుళ్ళన్నీ
వెన్నెల్లో గోదారిలా
మదిలోనే మంద్రంగా
సాగేను మౌనంగా....

మనసులో మాటలన్నీ
పాటగా బాణీలు కట్టుకుని
మూగబోయిన గొంతుతో
పెదవిదాటక  బెంగగా

కన్నీట మునిగిన మనసుకు
పన్నీరై పలకరించి
చినుకుగా కురిసే తొలకరిలో

 వెలుగుచూసె ఆశలేవో  మొలకగా

మండే ఎండలకు నీడలాటి
నేస్తంగా ఎదను తడిపిపోయే
వర్షాన్ని వెంటపెట్టుకుని
హర్షం పంచగా వచ్చిన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు