కథల పోటీలో భైతి దుర్గమ్ కు బహుమతి

 సాహితి కిరణం మాస పత్రిక మరియు సూర్య సాహితి వేదిక  సంయుక్తంగా నిర్వహించిన బాలల కథల పోటీలో సిద్దిపేటకు చెందిన కథా రచయిత భైతి దుర్గమ్ వ్రాసిన పుణ్య కార్యము అనే కథకు తృతీయ బహుమతి లభించింది.గురువారం రాత్రి  హైద్రాబాద్ లోని త్యాగరాయ గాన సభలో నిర్వహించిన సాహితి కిరణం పత్రిక 14వ వార్షికోత్సవ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు కె వి రమణాచారి గారి చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకున్నారు.ఈ కార్యక్రమంలో సాహితి కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, నేటి నిజం సంపాదకులు బైస దేవదాసు,వంశీ రామరాజు పాల్గొన్నారు.  బహుమతి అందుకున్న భైతి దుర్గమ్ ను సిద్దిపేట బాల సాహిత్య రచయితలు,అక్షర సేద్యం ఫౌండేషన్ సభ్యులు,ఉపాధ్యాయులు, మిత్రులు,శ్రేయోభిలాషులు, సుగుణ సాహితి సమితి  అధ్యక్షుడు మొసర్ల మాధవరెడ్డి అభినందించారు.
కామెంట్‌లు