నా తెలంగాణ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నా తెలంగాణా, నాతెలంగాణా 
ఘన సిరుల నెలవై తులతూగు వీణా
!!నా తెలంగాణా!!
వాగులూ వంకలూ ఏరులూ నదులైన నీరు
మన బీళ్ళకు మరలి కదలి కదలీ వెడలి 
పసిడి పంటల నిచ్చె బంగారు తల్లీ
సుఖశాంతులొసగేటి మాకల్పవల్లీ 
!!నా తెలంగాణా!!
ధీరులా, శూరులా వీరులా నిలయమూ
కర్షకా,శ్రామికా,కవిగాయకా కాణాచీ
సబ్బండ వర్ణాల సకల జనులేకమై
అహరహము శ్రమియించి అమ్మ దాస్యము బాపె
!!నా తెలంగాణా!!
*********************************

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
చాలా బాగుంది చిరు గేయం అభినందనలు. ధన్యవాదములు సార్. 🙏