వనజ శతకము(అట వెలదులు )-ఎం. వి. ఉమాదేవి
 81)
ఒకడు పదవిమింగి యోటర్లనణిచేసి
పసిడిపండుభూమి పంచుకొనును
నేటిరైతు ఘోషనెట్లు మాపగలము?
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
82)
పంటచేలకిపుడు పలుకోట్లునెకరాకు
కాపురాలలోను గల్గుచిచ్చు
తగులబెట్టడములు తగవులు మొదలాయె 
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
83)
దూరవాణి స్థంభదుష్పరిణామంబు
పిచుకలన్ని పోయె పీడకలిగి
ప్రాణభయము తోడ ప్రకృతియె నల్లాడె 
వనజమాట మిగుల వాస్తవమ్ము!
84)
సంప్రదాయవంట సగముచులకనయ్యె
పప్పుదినుసులన్ని పరిహసించె
విఫణిలోన ధరలు విడ్డూరముగ బెంచె 
వనజ మాట మిగులవాస్తవమ్ము !

కామెంట్‌లు