పుత్తూరు పిల'గోడు' పుస్తకావిష్కరణ:

 రచయిత  ఆర్.సి.కృష్ణ స్వామి రాజు రచించిన 13వ పుస్తకం పుత్తూరు పిల'గోడు' పుస్తకావిష్కరణ సభ ఆదివారం  ఉదయం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. తెలంగాణ రాష్ట్ర రవాణా రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు  మాట్లాడుతూ ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా మాతృభాష ను మరువకూడదన్నారు.
మరిస్తే మన మూలాలను  మరిచినట్లే అన్నారు.
 తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ  మాట్లాడుతూ  హాస్య నేపథ్యం ఉన్న కథలు పాటకులను విశేషంగా ఆకర్షిస్తాయని, వారి మనసుల్లో నిలబడిపోతాయన్నారు. చిత్తూరు జిల్లా మాండలికంలో రచయిత సృష్టించిన ఈ హాస్య కథల్ని ప్రశంసించారు.  రచయిత  పాణ్యం దత్త శర్మ మాట్లాడుతూ  యాసలో రాసిన ఈ కథల్లో జీవముందని, మానవ సంబంధాల విలువ తెలియజేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.
రచయిత రాజు ప్రసంగిస్తూ హాస్యమైనా, సాంఘికమైన కథలైనా తను సామాజిక బాధ్యత తోనే రచనలు చేస్తున్నానన్నారు.
సినీనటులు జెన్నీ, సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాదరావు, "అచ్చంగా తెలుగు ప్రచురణల" అధినేత్రి భావరాజు పద్మిని తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.
కామెంట్‌లు