పాదముద్రలు (చిట్టి వ్యాసం);- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 గమ్యమెరుగని, దారీ తెన్నూ తెలియని ఈ అనంతపయనంలో మనతో కలిసే ఎందరో వ్యక్తులు మనను ప్రభావితం చేసే శక్తులు! బంధమో, సంబంధమో, అనుబంధమో ఋణానుబంధంగా మారి మన జీవనగమనాన్ని నిర్దేశిస్తోంది! అది గమనమో, నిగమనమో, నిర్గమనమో, తెలియనితనమో, తెలిసిన పద్మవ్యూహమో ఏమయితేనేం, ఏదయితేనేం ఆజీవన పర్యంతం మనను ప్రభావితం చేస్తోంది! కాలం గడిచేకొద్దీ ఛిద్రమయ్యే జ్ఞాపకాలు కావు మనవి. ఊడ్చేస్తేపోయే ముంగిట్లోముగ్గు కాదు మనజీవితం! ప్రేమ, అభిమానం, ఇష్టం, కోరిక, కోపం, తాపం, అసహ్యం, ద్వేషం మన మహాభినిష్క్రమణ తర్వాత కూడా పాదముద్రలుగా నిలిచే ఉంటాయి. మన అనంతపయనపు జాడలను ఆవిష్కరిస్తూనే ఉంటాయి!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు