ఆలోచించాలి (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 "గతకాలముమేలు వచ్చు కాలము కంటెన్" అని నుడివిన మహాకవి ఇప్పుడుంటే తెలిసేది. "గతమెంతొ ఘనకీర్తి కలవోడా" అని రాసిన
గేయరచయితకు నేటిపరిస్థితి తెలియదేమో. "గతకాలపు పునాదులపైనే భవిష్యత్ బంగాళా
నిర్మితమౌతుంది" అని చెప్పిన మేధావికి
అబ్బే! మెదడున్నట్టు అనిపించడం లేదుకదూ! "మంచిగతమున కొంచెమేనోయ్/ మందగించక ముందుకడుగెయ్/ వెనకపడితే వెనకేనోయ్"అని చెప్పిన
గురజాడను మన గురువుగా ఎంచుకుందాం. పాతంతా ఒకరోతగా భావిద్దాం. కొత్తంతా ఒక పరిమళాల తోటగా చూద్దాం. పాతకాలపు చింతకాయపచ్చడిని ఒదిలించుకుందాం.
కొత్తకాలపు పిజ్జా బర్గర్లు తిందాం. నిలబడి నీళ్ళుతాగడం పాతమాట.
పరుగెత్తి పాలుతాగడం కొత్తఆట.
ఎడ్లబండి పాతమాట, ఎరోప్లేన్ కొత్తపాట.
అందుకే గతంమరిచి మనమంతా కొత్తపాట పాడుదాం! అని అనుకుందామా? కానీ…., మన మూలం మనం మరిచిపోతే మనకు పుట్టగతులుంటాయా మరి? తీవ్రంగా ఆలోచించాలి అందరం!!!
+++++++++++++++++++++++++
కామెంట్‌లు