నేను నాపూలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పూలు
కవ్విస్తున్నాయి
పూలు
ప్రేమిస్తున్నాయి

పూలు
ఎదురుచూస్తున్నాయి
పూలు
వెంటపడుతున్నాయి

పూలు
పలుకరిస్తున్నాయి
పూలు
పులకరిస్తున్నాయి

పూలు
పిలుస్తున్నాయి
పూలు
పకపకలాడుతున్నాయి

పూలు
ప్రక్కనుండమంటున్నాయి
పూలు
ప్రకాశించిపోతున్నాయి

పూలు
విహరిద్దామంటున్నాయి
పూలు
వేడుకచేసుకుందామంటున్నాయి

పూలు
సొగసులుచూపుతున్నాయి
పూలు
సరసాలాడుతున్నాయి

పూలు
పరవశించిపోతున్నాయి
పూలు
పరిమళాలుచల్లుతున్నాయి

పూలు
వికసిస్తున్నాయి
పూలు
పరిహసిస్తున్నాయి

పూలు
కథలుచెబుతున్నాయి
పూలు
తలపులులేపుతున్నాయి

పూలు
వర్ణించమంటున్నాయి
పూలు
వినోదపరచమంటున్నాయి

పూలు
కవితలుకూర్చమంటున్నాయి
పూలు
కైతలువినిపించమంటున్నాయి

పూలకోర్కెలు
తీరుస్తా
పెక్కుకైతలు
పుటలకెక్కిస్తా

పాఠకులను
చదివిస్తా
మాధుర్యాలను
పంచేస్తా


కామెంట్‌లు