సుప్రభాత కవిత ; -బృంద
ఎద లోయలలో నిదురించిన
కలలకు ఉత్తేజం కలిగించి
ఉప్పొంగే ఉత్సాహం 
అడుగులకు కలిగే తరుణం

రగిలే మనసుకు సాంత్వనగా
కదిలే కాలానికి అనుగుణంగా
మెదిలే భావాల మధుకలశంతో
మదిలో మాయని ఆశలతో

బాధల సుడిలో చిక్కిన
గాధలకు ఓదార్పుగా
మధురాతి మధురమైన
రాగసుధల పంచుతూ

అలజడి దాచిన మదికి
సలలిత స్నేహ హస్తమందిస్తూ
సడలని నమ్మకం పెంచుతూ
వదలక సాగే జీవనయానం

రంగులతో  స్వాగతించు
రహదారి ప్రయాణంలో
మరొక మనసుకు
ఊరటివ్వమని వస్తున్న వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు